తానా రేసులో తిపిర్నేని
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తదుపరి అధ్యక్ష పదవి (ప్రెసిడెంట్ ఎలెక్ట్ లేదా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి తిరుమల రావు తిపిర్నేని పోటీ చేస్తున్నారు. నాయకుల దిగజారుడుతనం వల్ల తానాలో ఇటీవల తలెత్తిన వర్గపోరాటం అమెరికాలోని తెలుగువారిని ఎంతో ఆవేదనకు గురిచేసిందని, సంస్థ వ్యవస్థాపక ఆశయాల సాధన కోసం కృషి చేయడానికే తాను ఈ పదవికి పోటీ చేస్తున్నానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగువారి అభ్యున్నతి కోసం వినియోగించాల్సిన లక్షల కొద్ది డాలర్లను కోర్టు కేసుల్లో వృధాగా ఖర్చు చేశారని ప్రస్తుత నాయకత్వాన్ని ఆయన దుయ్యబట్టారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి భాషా సంస్కృతులను అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
News Posted: 18 March, 2009
|