తెలుగుభాష ఎల్లలు దాటాలి
సిలికాన్ వేలీ: తెలుగు సాహిత్యాన్ని పాశ్చాత్య సాహిత్యానికి దగ్గరగా చేర్చేవి అనువాదాలేనని ఆచార్య వెల్చేరు నారాయణ రావు అన్నారు. అనువాదాల వల్లే మన సాహిత్యం గొప్పదనం ప్రపంచానికి తెలుస్తుందని మార్చి 14న మిల్పిటాస్ లో జరిగిన 4వ కాలిఫోర్నియా సాహితీ సదస్సులో ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యాన్ని ఎంకగా అనువదిస్తే అంత మంచిదని, ఈ పని అమెరికా తెలుగువారి వల్లే సాధ్యమని `తెలుగు సాహిత్యానికి అనువాదాల ఆవశ్యకత' అనే అంశంపై ప్రసంగిస్తూ వెల్చేరు అన్నారు.
తెలుగులో డయాస్పోరా కథలు మరిన్ని రావాలని వేలూరి వెంకటేశ్వర రావు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. `తెలుగు డయాస్పోరా కథాసాహిత్యం' అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత కథల్లో నోస్టాల్జియా తప్ప డయాస్పోరా లేదన్నారు. ఈ సదస్సులో కిరణ్ ప్రభ, డాక్టర్ అల్లూరి వెంకట నరసింహ రాజు, తాటిపామల మృత్యుంజయుడు, వంశీ ప్రఖ్య, అపర్ణ గునుపూడి, ఆచార్య వేమూరి వెంకటేశ్వర రావు, రఘు మల్లాది, హెప్సి సుంకరి, డాక్టర్ కె. గీత తదితరులు ప్రసంగించారు. ఆరు నెలల్లో తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్న బర్కిలీ విశ్వవిద్యాలయ విద్యార్థుల అనుభవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయిబ్రహ్మానందం గొర్తి ఆధ్వర్యంలో ఈ సదస్సు జయప్రదంగా ముగిసింది.
News Posted: 18 March, 2009
|