3న సీతారామ కళ్యాణం
షికాగో : వచ్చే ఏప్రిల్ 3వ తేదీన గ్రేటర్ షికాగో లేమాంట్ లోని హిందూ దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు జయదేవ్ మెట్టుపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 శుక్రవారం, 4 శనివారం, 5 ఆదివారాలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆ ప్రకటనలో జయదేవ్ విజ్ఞప్తి చేశారు.
ఉత్సవ కార్యక్రమ వివరాలు ఇవీ :
శుక్రవారం ఏప్రిల్ 3, 2009 వివాహ పూర్వాంగము
ఉదయం 10 గంటలకు శ్రీరాముల వారి అభిషేకం
సాయంత్రం 6 గంటలకు కళ్యాణ రామ ఉత్సవ మూర్తి అభిషేకం
చూర్ణోత్సవం, మంగళస్నానం
రాత్రి 7 గంటలకు వధువు సీతాదేవి గోరింటాకు వేడుక
రా. 8 గంటలకు సీతారాముల వారికి నలుగు
రా. 9 గంటలకు ఆహ్వానితులకు తీర్థ ప్రసాద గోష్టి
శనివారం ఏప్రిల్ 4, 2009 వివాహ రోజు
ఉదయం 9 గంటలకు రామ తారక హోమం
మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మ వారికి చీర సారె సాంగ్యం
శ్రీ వేంకటేశ్వర దేవాలయం వారికి మహాద్వారం వద్ద సాదరాహ్వానం
2 గంటలకు పెళ్ళి మంటపం లోకి అతిథుల రాక
2.30 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం ప్రారంభం
సాయంత్రం 4.30 గంటలకు వధూవరులకు కానుకలు, చదివింపులు
సా. 6.30 పెళ్ళి మెరవని. ఆలయ ప్రాంగణంలో నూత వధూవరులు శ్రీ సీతారాముల ఊరేగింపు
7 గంటలకు వధూవరుల ప్రణయ కలహోత్సవం
8 గంటలకు ఏకాంతసేవ, డోలాయన, రోగ నృత్యోపచారం
8.45 గంటలకు తీర్థ ప్రసాదాల గోష్టి
ఆదివారం ఏప్రిల్ 5, 2009 వివాహం మరుసటి రోజు
ఉదయం 10 గంటలకు ముత్తంగి సేవ
మధ్యాహ్నం 11.30 గంటలకు శ్రీ సీతారామ పట్టాభిషేక సర్గ పారాయణం
12.30 గంటలకు శ్రీ సీతారామ పట్టాభిషేకం
1.30 గంటలకు తీర్థ ప్రసాదాల గోష్టి ఉంటుందని ఆలయ నిర్వాహకులు వివరించారు.
News Posted: 19 March, 2009
|