'సతి' ప్రారంభానికి రండి
న్యూజెర్సీ : సౌత్ ఆసియన్ టోటల్ హెల్త్ ఇనీషియేటివ్ (సతి)ను మార్చి 26 సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తున్నట్లు ముసుకు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్ విక్ లో ఉన్న రాబర్ట్ వుడ్ జాన్సన్ యూనివర్శిటీ హాస్పిటల్, ఆర్లేన్ అండ్ హెన్రీ షావర్జ్ మాన్ కోర్ట్ యార్డ్, వన్ రాబర్ట్ వుడ్ జాన్సన్ ప్లేస్ లో జరుగుతుందని తెలిపారు. సతి సలహా బోర్డు సభ్యునిగా ఉన్న ప్రారంభోత్సవానికి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల వ్యవహరిస్తున్నారని మహేందర్ ఆ ప్రకటనలో వివరించారు. ప్రవాసాంధ్రుల ఆరోగ్య విషయాలపై చక్కని అవగాహన కల్పించే సతి ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఉపేంద్ర చివుకుల ఆహ్వానించారని మహేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలోని యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
సాంప్రదాయ ఆరోగ్య ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడం, ఆరోగ్యం, ఆరోగ్య రక్షణ విషయంలో ఉన్న తేడాల నివారణకు కృషి చేయడం, దక్షిణాసియా వాసుల ఆరోగ్యానికి సంబంధించి కచ్చితమైన, అత్యాధునిక పరిశోధనాధారిత సమాచారాన్ని అభివృద్ధి చేయడం, దక్షిణాసియా వాసుల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, సాధికారత సాధించడం, ఆరోగ్య సూత్రాలను పాటించడంలో భాగస్వాములను చేయడం అనే లక్ష్యాలతో సతి పనిచేస్తుందన్నారు.
సతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూజెర్సీలోని యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ - రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్ డీన్ పీటర్ ఎస్. అమెంటా ప్రధాన వక్తగాను, న్యూజెర్సీలోని ఆరో్గ్య, సీనియర్ సర్వీసెస్ విభాగం కమిషనర్ హీతర్ హోవార్డ్ గెస్ట్ స్పీకర్ గా ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని సతి కో డైరెక్టర్లు సునందా గౌర్, నవీన్ మెహ్రోత్రా, సతి సలహా బోర్డు సభ్యులు పూనమ్ అలైఘ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల, గీతా ఘయ్, రాబర్ట్ సి. లైక్, జిగ్నారావులు నిర్వహిస్తున్నారని మహేందర్ ముసుకు తన ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం కావాల్సిన వారు Margaretanne Reina at 732-235-8504 నెంబర్ లో సంప్రతించవచ్చు.
News Posted: 24 March, 2009
|