సిటిఎ అధ్యక్షునిగా ప్రసాద్
షికాగో : షికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఎ) కార్యవర్గాన్ని ప్రకటించారు. సంస్థ అధ్యక్షునిగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు, ప్రసాద్ తళ్ళూరు నియమితులయ్యారు. పదేళ్ళుగా తళ్ళూరు ప్రవాసాంధ్రులకు అనేక సేవలు అందిస్తున్నారు. మార్చి 29న స్థానిక బాలాజీ ఆలయంలో షికాగో తెలుగు అసోసియేషన్ సమావేశమై అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను సభ్యులకు పరిచయం చేశారు. సిటిఎ కార్యనిర్వాహకవర్గం సభ్యులను సంస్థ వ్యవస్థాపకులు రవి ఆచంట, రాజ్ కావూరు పరిచయం చేశారు.
సిటిఎ కార్యానిర్వాహకవర్గం సభ్యులు వీరే :
ప్రసాద్ తళ్ళూరు : ప్రెసిడెంట్
ప్రవీణ్ మోటూరు : వైస్ ప్రెసిడెంట్
రావు ఆచంట : సెక్రటరీ
వెంకట్ గ్యాజంగి : ట్రెజరర్ గా ఎంపిక కాగా,
డైరెక్టర్లుగా విజయ్ కొండూరు, ప్రవీణ్ రెడ్డి భూమన, సుబ్బారావు పోతిన, కృష్ణ అడుసుమల్లి, మనోహర్ వేదాంతం, శ్రీనివాస్ చుండు, సాయ్ గౌర్నేని, నరేష్ గౌడ్ చెరుకు, చైతన్య చొప్పరపు, ఆకుల రమేష్, మూర్తి కొప్పాక, శివచౌధరి, రమేష్ మర్యాల, ప్రసాద్ చండ్ర, లక్ష్మీనారాయణ తాతినేని, శ్రీనివాస్ గణమని, సాయ్ యండమూరి, ప్రవీణ్ రెడ్డి భీంరెడ్డి (ఇండియా వ్యవహారాలు) నియమితులయ్యారు. తన మీద అచంచల నమ్మకం ఉంచి సిటిఎ అధ్యక్షునిగా నియమించినందుకు ప్రసాద్ తళ్ళూరు షికాగో తెలుగు సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ఆశయాల సాధన కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News Posted: 31 March, 2009
|