షికాగోలో 'తెలుగు పండుగ'
షికాగో : షికాగో తెలుగు అసోసియేషన్ తన ప్రారంభ ఉత్సవాన్ని వచ్చే జూలై 2, 3 తేదీల్లో నిర్వహిస్తోంది. 'తెలుగు పండుగ' పేరుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల కో ఆర్డినేటర్ గా రవి ఆచంటను, స్టీరింగ్ కమిటీని సంస్థ అధ్యక్షుడు ప్రసాద్ తళ్ళూరు నియమించారు. షికాగోలో, మిడ్ వెస్ట్ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరూ పాల్గొనే ఈ ఉత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకోనున్నాయని రావు ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు. షికాగో, మిడ్ వెస్ట్ దేశాల్లో నివసిస్తున్న వివిధ రంగాలకు చెందిన తెలుగువారిని ఒకే వేదిక వద్దకు తీసుకురావాలన్న సదాశయంతో ఈ తెలుగు పండుగ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
తెలుగువారికి అత్యవసర సేవలు అందించడం
హెల్ప్ లైన్ సేవలు
ఉద్యోగ శిక్షణ, కౌన్సెలింగ్, ప్లేస్ మెంట్
ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వైద్య శిబిరాల నిర్వహణ
తదితర కార్యక్రమాల నిర్వహణకు గాను నిధుల సేకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు రావు ఆచంట వెల్లడించారు.
స్టీరింగ్ కమిటీకి రవి ఆచంట నాయకత్వం వహిస్తారు. కృష్ణ అడుసుమల్లి డిప్యూటీ కో ఆర్డినేటర్ గా, రాజ్ కావూరు కార్యదర్శిగా, వేణు కోడూరు కోశాధికారిగా, ప్రవీణ్ మోటూరు ప్రణాళిక, నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీమతి హరిత భూమన, విజయ్ గన్నె, విజయ్ వెనిగళ్ళ, సుబ్బారావు ఐనంపూడి, చక్రవర్తి మాగంటి, ఉష వేదాంతం, నిరంజన్ వల్లభనేని, ప్రవీణ్ కొయ్యలమూడి స్టీరింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
కార్యక్రమం వివరాలు :
తెలుగు పండుగ సమావేశాల్లో భాగంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఐదు లక్షల మంది తెలుగువారికి ప్రధానంగా అవసరమైన సమస్యల మీద చర్చ, సమీక్ష జరుగుతుంది.
ప్రవాసాంధ్రుల పిల్లలలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు మంచి వేదికను షికాగో తెలుగు అసోసియేషన్ కల్పిస్తుంది.
తెలుగు పండుగకు హాజరయ్యే తెలుగు కుటుంబాలకు పలు హృదయ రంజకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వ్యాపార సంబంధమైన ప్రదర్శనలుంటాయి. దీనిలో భాగంగా ఆభరణాలు, చీరలు, డ్రెస్ లు, హ్యాండీ క్రాఫ్ట్, డివిడి\సిడి, తెలుగు సాహిత్యం తదితరాలెన్నో ఈ ప్రదర్శనలో ఉంటాయి.
నోరూరించే తెలుగు వంటకాలతో కమ్మని రుచికరమైన విందు ఉంటుంది.
తెలుగు పండుగలో నిర్వహించే కళాకారుల కార్యక్రమాలు :
ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, డాక్టర్ గజల్ శ్రీనివాస్, టాలీవుడ్ హీరో శ్రీకాంత్, హీరోయిన్లు కాజల్, నమిత, సంజన, సియ, టాలీవుడ్ హాస్య నటులు అలీ, హేమ, తనికెళ్ళ భరణి తదితరులు తెలుగు పండుగలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా షికాగో తెలుగు అసోసియేషన్ అందరికీ ఆహ్వానం పలికింది.
News Posted: 2 April, 2009
|