టిఎల్సిఏ ఉగాది వేడుక
న్యూయార్క్: న్యూయార్క్ నగరం, క్వీన్స్ లోని గణేష్ దేవాలయ ఆడిటోరియంలో విరోధినామ సంవత్సర ఉగాది కార్యక్రమం తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఆ ఆడిటోరియం ఆవరణాన్ని తెలుగు సంస్కృతి ఉట్టిపడేట్లు అందంగా తీర్చిదిద్దారు. తెలుగు ప్రజలు చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరైనారు. యువతీ, యువకులు తెలుగు సాంప్రదాయక దుస్తులు ధరించి చాలా ఆకర్షణగా ఈ కార్యక్రమంలో నిలిచారు.
పలు డాన్స్ స్కూళ్ల నుండి పిల్లలు పెద్ద సంఖ్యలో డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయక, జానపద, ఫ్యూజన్, మూవీ మిడ్లీ లాంటి పలు రకాల సంగీత కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. జయలలిత, చిట్టిబాబుల కామెడీ షో, జితేంద్రనాథ్ మిమిక్రీ, పార్థసార్ధి, మాలతి, సౌజన్యల మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు చాలా హృద్యంగా సాగాయి. అర్ధరాత్రి దాకా ఈ కార్యక్రమాలు క్రిక్కిరిసిన ప్రేక్షకులతో కోలాహలంగా సాగాయి. టిఎల్సిఏ చరిత్రలో ఇదొక రికార్డుగా నిలిచింది.
టిఎల్ సిఏ అధ్యక్షుడు ముత్యాల వెంటేష్ ఉగాది ప్రాశస్త్యాన్ని వివరిస్తూ క్లుప్తంగా ప్రసంగించారు. టిఎల్ సిఏ కార్యక్రమాన్ని, ఉగాది సావనీర్ ను ఆయన విడుదల చేసారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలను సభలో అందరికి పరిచయం చేశారు. దాతలు పైల్లా మల్లారెడ్డి, సాధనా రెడ్డి, ఆరమళ్ల పూర్ణచంద్రా రెడ్డి, ఉషా రెడ్డి, బిఓటి చైర్ సుంకర అప్పారావులు కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ ప్లేక్ లను బహూకరించారు. టిఎల్ సిఏ కార్యదర్సి ముథికి శివ కుమార్ వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
News Posted: 8 April, 2009
|