గీతా తెలుగు సంబరాలు
గ్రేటర్ ఇండియానాపోలీస్ తెలుగు సంఘం (గీతా) ఆధ్వర్యంలో శనివారం నాడు స్ధానిక హామిల్‌టన్ కౌంటీ హాలులో వేడుకగా ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఇండియానాపోలీస్ తెలుగు సంఘం 30 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఉగాది వేడుకలతో పాటు తెలుగు సంబరాలను నిర్వహించారు. ఇండియానాపోలీస్ నగరం నలుమూలల నుండి దాదాపు వెయ్యిమంది ప్రవాసాంధ్రులు తమ కుటుంబాలతో ఈ వేడుకలకు హాజరయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయిన ఈ ఉత్సవాలు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో రాత్రి 11 గంటల వరకు ప్రవాసాంధ్రుల కేరింతల మధ్య జరిగాయి. గీతా అధ్యక్షుడు తొండెపు సుధీర్ మాట్లాడుతూ అమెరికాలో ప్రాచీనమయిన తమ తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. అమెరికాలో ప్రముఖ క్రీడా అయిన అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు మెర్విన్ బుల్లిట్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఇక్కడి స్ధిరపడిన తెలుగువారు స్నేహశీలురని కొనియాడారు.. అనంతరం జరిగిన జానపద నృత్యాలు, 'చెడపకురా - చెడేవు' నాటిక, గ్రెగరీ హాంకాక్ నృత్య ప్రదర్శన, ఫణీందర్, శ్రీదేవి బృందం సంగీత విభావరి తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గీతా అధ్యక్షుడు తొండెపు సుధీర్ తో పాటు, కార్యదర్శి చింతల రాము, కోశాధికారి హరీష్ తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
View Event Photos at:
http://www.telugupeople.com/members/photo_Albums.asp?profile=60667&Album=1
News Posted: 20 April, 2009
|