26న యూటా ప్రారంభం
ఎడిసన్, న్యూజెర్సీ: సమైక్య తెలుగు అమెరికా సంఘం (యూటా) ప్రారంభ సమావేశం ఈనెల 26న ఆదివారం ఇక్కడి రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో జరుగుతుందని, ముఖ్య అతిథి గా న్యూజెర్సీ గవర్నర్ జాన్ కొర్జైన్ హాజరవుతున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేసారు. మధ్యాహ్నం 11:30 నుంచి సాయంత్రం 4:00 వరకు జరిగే ఈ కార్యక్రమానికి తెలుగువారందరూ ఆహ్వానితులేనని, www.utaaworld.org వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
కుల, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం యూటాను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేసారు. యూటా ప్రారంభ సమావేశంలో న్యూజెర్సీ అసెంబ్లీమాన్, డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ పాఠశాలల అభివృద్ధి అధారిటీ అధ్యక్షుడు క్రిస్ కొల్లూరి, ఎడిసన్, వుడ్ బ్రిడ్జ్ టౌన్షిప్ ల మేయర్లు ప్రసంగిస్తారని తెలిపారు. అనితా కృష్ణ గ్రూపు సంగీత కార్యక్రమం, సి. హెచ్. కాంతం విద్యార్థుల నాట్య ప్రదర్శన, మౌనిక, ఇషా, కావ్య, ప్రణవ్ ల పాటలు వుంటాయని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయని కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
News Posted: 20 April, 2009
|