ఆటా ప్రత్యేక సమావేశం
న్యూయార్క్ : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ట్రస్ట్ బోర్డ్ మే 2న న్యూయార్క్ విమానాశ్రయం వద్ద ఉన్న వింధామ్ గార్డెన్ హొటల్ లో అత్యవసరంగా సమావేశమైంది. ఈ అత్యవసర సమావేశంలో బండారు శివరామ్ రెడ్డి మృతికి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. జనవరి 24 నాటి బోర్డ్ సమావేశం తీసుకున్న నిర్ణయాలపై నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చ జరిగిందని ఆటా అధ్యక్షుడు జితేందర్ ఎం రెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సంస్థలో ఖాళీగా ఉన్న పదవులను ఎన్నిక లేదా ఎంపిక ద్వారా భర్తీ చేసే అంశంపైన చర్చ జరిగింది. రానున్న కొద్ది నెలల్లో సంస్థ నిర్వహించే కార్యక్రమాలపై ఆటా ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశంలో చర్చకు వచ్చింది. వీటితో పాటు అధ్యక్షుని అనుమతితో జనవరి 24 నాటి బోర్డ్ సమావేశం మినిట్స్ కు ఆమోదం, వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యవహారాలను చూసేందుకు అడ్ హాక్ కమిటీ నియామకం, 10వ ఆటా మహాసభలు, యూత్ కన్వెన్షన్ కు సంబంధించిన అకౌంట్ల తనిఖీ కోసం ఆడిట్ కమిటీ సభ్యుల నియామకం, నామినేటింగ్ సభ్యుల నియామకం, భవిష్యత్ లో ఆటా సమావేశాలు నిర్వహించాల్సి తేదీలు తదితర అంశాలపై ఈ అత్యవసర సమావేశంలో చర్చించినట్లు ఆటా అధ్యక్ష, కార్యదర్శులు వివరించారు.
ఆటా ట్రస్ట్ బోర్డ్ అత్యవసర సందర్భంగా ఆ రోజు ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ అల్పాహార విందు, 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మధ్యలో భోజన విరామంతో సహా సమావేశం జరిగింది. సంధ్య గవ్వ ప్రార్థనాగీతం ఆలపించారు. అనంతరం ఆటా వ్యవస్థాపక ప్రముఖుడు బండారు శివరామ్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా సమావేశం ఒక నిమిషం మౌనం పాటించింది. అనంతరం సమావేశం అజెండాలోని అంశాలపై చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు లేదా వారి ప్రతినిధులుగా అర్జున్ ద్యాప, బుచ్చిరెడ్డి, చిన్నబాబు (కెకె) రెడ్డి, చిట్టెంరాజు వంగూరి, సివిఆర్ ఎన్ రెడ్డి ప్రతినిధిగా సంధ్య గవ్వ, దామోదర్ వీరారెడ్డి, హరీందర్ రెడ్డి ప్రతినిధిగా శ్రీనివాస్ ఆర్. పిన్నపురెడ్డి, జితేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి, కరుణాకర్ మాధవరం, మల్లారెడ్డి పిళ్ళా, పరశురామ్ పిన్నపురెడ్డి, పరమేశ్ భీమిరెడ్డి, ప్రేమ్ రెడ్డి, రాజేందర్ జిన్నా, రాజు చింతల, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రావు టేక్మల్, రామ్ మోహన్ కొండా, రోహిణి బొక్కా ప్రతినిధిగా గోపాల్ రెడ్డి గడే, సంజీవరెడ్డి, సత్య కందిమళ్ళ, శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధిగా హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ అనుగుల, సుధాకర్ పేర్కారి, శ్యామరెడ్డి హాజరయ్యారు.
ఉదయం 10.05 గంటలకు ఆటా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ప్రత్యేక బోర్డు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు, సమీక్షలు నిర్వహించారు. మరి కొన్ని అంశాలపై తీర్మానాలు చేశారు.
News Posted: 11 May, 2009
|