వైఎస్ కు సిటిఎ అభినందన
షికాగో : కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్ లోనూ మళ్ళీ అధికారం చేపడుతున్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిలకు షికాగో తెలుగు అసోసియేషన్ (సిటిఎ) శుభాభినందనలు తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులకు కూడా సిటిఎ అభినందించింది. అధికార పగ్గాలను మరోసారి చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరిన్ని ప్రజోపయోగ, సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి రాష్ట్రాన్ని ఇంకా ముందంజలో నడిపించగలరన్న ఆశాభావాన్ని షికాగో తెలుగు అసోసియేషన్ వ్యక్తం చేసింది.
భారతదేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేవిగా జరిగాయని సిటిఎ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసిన భారత ఎన్నికల యంత్రాంగానికి కూడా సిటిఎ అభినందనలు తెలిపింది. కేంద్రం, రాష్ట్రంలో విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు షికాగో తెలుగు అసోసియేషన్ తరఫున గ్రీటింగ్స్ పంపించినట్లు ఆ సంస్థ కార్యదర్శి రావు ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు.
News Posted: 20 May, 2009
|