వైఎస్ విజయోత్సవాలు
స్మిత్ విల్లే (టిఎన్) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని టెన్నెస్సీ రాష్ట్రం స్మిత్ విల్లేలో అమెరికాలోని వైఎస్సార్ యువసేన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 23, 24 శని, ఆదివారాల్లో స్మిత్ విల్లేలోని ఈస్ట్ సైడ్ ఇన్ హొటల్ లో విజయోత్సవ సంబరాలు, 24న విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ యువసేన కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన రాజశేఖరరెడ్డికి, వైఎస్సార్ యువసేన అమెరికా కమిటీ సభ్యులందరికీ నాగిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం వైఎస్సార్ యువసేన అమెరికా కమిటీ గౌరవ సలహాదారు మునగాల బ్రహ్మారెడ్డి ఇప్పటికే హొటల్ ను బుక్ చేశారని వివరించారు. యువసేన సభ్యుడు, అన్న వైఎస్సార్ అభిమాని వీరారెడ్డి 24వ తేదీన నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. ఈ విజయోత్సవానికి, ర్యాలీకి వైఎస్సార్ అభిమానులు, సంఘాల వారు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
News Posted: 21 May, 2009
|