మొక్కు తీర్చిన ఎన్నారైలు
న్యూజెర్సీ : డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విజయోత్సవం సందర్భంగా న్యూజెర్సీలోని బ్రిడ్జివాటర్ బాలాజీ దేవాలయంలో ఏలూరి నరేందర్ రెడ్ది, కాకూరి శ్రీనివాసరెడ్ది, పులిమి జగన్మోహన్ రెడ్డి, జంగా వేణుగోపాలరెడ్డి తదితరులు 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఏలూరి నరేందర్ రెడ్ది ఆధ్వర్యంలో మే 23 శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి 500 మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి - విజయలక్ష్మి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి - భారతి దంపతుల పేర్లతో సుపరిపాలన, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్ అభిమానులు బ్రిడ్జివాటర్ బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ సందర్భంగా ఏలూరి నరేందర్ రెడ్ది మీడియాతో మాట్లాడుతూ 'డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే న్యూజెర్సీలోని బ్రిడ్జివాటర్ బాలాజీ దేవాలయంలో 101 టెంకాయలు కొట్టాలని మొక్కుకున్నామన్నారు. ఆ మొక్కుబడి తీర్చేం దుకు Washington DC, Maryland, Virginia నుంచి 500 మంది ప్రవాసాంధ్రులు వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ సుపరిపాలన అందించాలని, ఆయన పథకాలు జలయగ్నం, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరా ఇంటి పథకం, మహిళలకు రుణాలు, పావలా వడ్డీ పథకం, వృద్ధాప్య పెన్షన్లు పథకాలు నిత్యం ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో మరెవ్వరూ పేదరికంలో ఉండకుండా, ఆయురారోగ్యలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, బ్రిడ్జివాటర్ బాలాజీ దేవాలయంలో మొక్కులు తీర్చి పూజలు నిర్వహించినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, యువతకు చాలా అవసరం' అన్నారు.
పులిమి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 'డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించి, ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించినందుకు రెండు సంబరాలు జమిలిగా జరుపుకుంటున్నా'మన్నారు.
కాకూరి శ్రీనివాసరెడ్ది మాట్లాడుతూ, తాము మొక్కు తీర్చడానికి కారకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ అభివందనాలన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఆయన చిరకాలం వర్ధిల్లి, ప్రజలకు మంచి చేస్తూ, శాంతి సౌఖ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారు.
అభిమానులందరూ జై వైఎస్ రాజశేఖరరెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.
News Posted: 26 May, 2009
|