నాట్స్ తెలుగు సంబరాలు
ఓర్లాండో : జూలై 2 నుంచి 4వ తేదీ వరకూ 'తెలుగు సంబరాలు' నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉన్న ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని సంస్థ వివరించింది.
తెలుగు సంబరాల్లో పాల్గొనదలచిన వారు బసచేసేందుకు జూన్ 17 లోగా పీబాడీ ఓర్లాండో, రోసెన్ సెంటర్ హొటళ్ళలో గదులు రిజర్వ్ చేసుకునే వారికి ప్రత్యేక అద్దె ధర తగ్గింపు సౌకర్యం ఉంటుందని సంస్థ రాసిన న్యూస్ లెటర్ లో వెల్లడించింది. పీబాడీ ఓర్లాండో హొటల్ లో గెస్ట్ రూమ్ అద్దెలు ఈ విధమైన తగ్గింపు ధరలో లభిస్తాయి. సింగిల్ \ డబుల్ రూమ్ కు 114 డాలర్లు (18 ఏళ్ళ లోపు పిల్లలకు చార్జి ఉండదు)
రోసెన్ సెంటర్ హొటల్ లో సింగిల్ \ డబుల్ రూమ్ ధర 99 డాలర్లు (17 సంవత్సరాల లోపు పిల్లలకు చార్జి లేదు) అని నాట్స్ సంస్థ వివరించింది.
తెలుగు సంబరాల్లో పాల్గొనే ఉత్సాహవంతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జూన్ 15 వరకూ గడువు పెంచినట్లు సంస్థ పేర్కొంది.
అమెరికా తెలుగు సంబరాలకు హాజరవుతున్న అతిథుల వివరాలను సంస్థ ప్రకటించింది. వారు,
సినిమా నటులు : ఎన్టీఆర్, శ్రీకాంత్, సాయికుమార్, తారకరత్న, ఆహుతి ప్రసాద్, అలీ, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, చిట్టిబాబు, శివాజీ రాజా, కాజల్, నమిత, సంజన, నిఖిత, శియ, హేమ, జయలలిత, సన.
సంగీత కళాకారులు : ఎం.ఎం. కీరవాణి బృందం, ఫ్లూట్ నాగరాజు బృందం, వందేమాతరం శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్, యెల్లా వెంకటేశ్వరరావు, శివమణి, చంద్రతేజ.
సాహితీవేత్తలు : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వద్దిపర్తి పద్మాకర్, కడిమిళ్ళ వరప్రసాద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కోట లక్ష్మీ నరసింహం, అనుమాండ్ల భూమయ్య.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వక్తలు : స్వామి చిదాత్మానంద, సుబ్రమణ్యస్వామి, కమలకుమార్.
మిమిక్రీ కళాకారుడు : జితేంద్ర అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొంటున్నారని నార్త అమెరికా తెలుగు సొసైటీ ప్రకటించింది.
సంబరాల్లో పాల్గొనే వారు త్వరితంగా తమ పేర్లను నమోదు చేయించుకుంటే కార్యక్రమాన్ని నిర్వాహకులు మరింత ఆకర్షణీయంగా, ఆనందదాయకంగా రూపొందించడానికి వీలవుతుందని సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ను sambaralu.org లో కేవలం కొద్ది నిమిషాల్లోనే చేసుకోవచ్చని నాట్స్ సంస్థ వివరించింది.
News Posted: 13 June, 2009
|