'విటి సేవ'కు జీయర్ క్లాప్
న్యూజెర్సీ : క్రాన్ బరీలోని జీయర్ ఆశ్రమంలో జూన్ 20న జీయర్ ట్రస్ట్ అధిపతి చిన్న జీయర్ స్వామీజీ అంతర్జాతీయ యువజన సంస్థ వి.టి.సేవ (వలంటీరింగ్ టుగెదర్ ఫర్ సర్వీస్)ను లాంఛనంగా ప్రారంభిస్తారని సంస్థ అధ్యక్షుడు హరి ఎప్పనపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున ఆశ్రమంలో స్వామివారి ధార్మిక ప్రసంగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ 20 శనివారం సాయంత్రం 5గంటల నుంచి 8 గంటల నడుమ న్యూజెర్సీలోని క్రాన్ బరీలో 222 డే రోడ్ లో ఉన్న జీయర్ స్వామి ఆశ్రమంలో తమ సంస్థను ప్రారంభిస్తారని హరి ఎప్పనపల్లి వివరించారు.
ఈ సంవత్సరం మే 24న న్యూజెర్సీలో జరిగిన తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఏఎస్) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 'వి.టి.సేవ సంస్థ వెబ్ సైట్' ను స్వామీజీ ప్రారంభించారని హరి ఎప్పనపల్లి తెలిపారు. ఈ సందర్భంగానే విటిసేవ అధ్యక్షునిగా హరి ఎప్పనపల్లిని, మురళి దుగ్గిరాల - హరి ఎప్పనపల్లి నాటి కార్యక్రమం కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. అవసరంలో ఉన్నవారికి సేవలు అందించే క్రమంలో యువత కొంతమేరకు తమ సమయాన్ని వెచ్చించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది.
News Posted: 15 June, 2009
|