టొరంటో 'సూపర్ సింగర్'
టొరంటో : గ్రేటర్ టొరంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో తానా - మా టీవీ సూపర్ సింగర్ పోటీలను శనివారం మిస్సిసాగాలో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన ఇద్దరు షికాగోలో జరిగే తానా 17వ మహాసభల్లో నిర్వహించే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ప్రముఖ కర్ణాటక సంగీత గాయని మంజూ శంకరనారాయణ్ వ్యవహరించారు.
చివరి వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా సురేష్ నిట్టల, బార్ల ధీరజ్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టొరంటో తెలుగు సంఘం అధ్యక్షుడు చారి సామాంతపూడి, తానా ఉపాధ్యక్షుడు సూరపనేని లక్ష్మీనారాయణ, అబ్దుల్ మునాఫ్, సుఖవాసి గంగాధర్, అరుణ్ కుమార్, వారణాసి రవి, జాహా అబ్దుల్, లక్ష్మీ వెల్లంకి, జ్యోతి సామాంతపూడి, వింధ్యా వారణాసి, మూల్పూరి మీనా, సూరపనేని హారిక తదితరులు పాల్గొన్నారు.
News Posted: 18 June, 2009
|