ఐఎన్ ఒసి ఆహ్వానం
న్యూయార్క్ : భారతదేశ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి ఆనంద్ శర్మకు జూన్ 19 శుక్రవారంనాడు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మహేష్ సలాది ఒక ప్రకటనలో తెలిపారు. న్యూయార్క్ లోని మారియట్ మార్క్విస్ హొటల్ లో నిర్వహిస్తున్న ఈ సన్మానసభకు ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో హాజరు కావాలని మహేష్ సలాది ఆహ్వానించారు. న్యూయార్క్ నగరం, 1535 బ్రాడ్ వేలోని మారియట్ మార్క్విస్ హౌటల్ ఐదవ అంతస్థులో ఉన్న వెస్ట్ సైడ్ బాల్ రూమ్ లో సాయంత్రం 7.15 గంటలకు రిజిస్ట్రేషన్, కాక్ టైల్స్ కార్యక్రమం మొదలవుతుందని ఆయన వివరించారు. అతిథులు ఈ సన్మాన కార్యక్రమానికి నిర్ణీత వేళకు ముందుగా హాజరు కావాలని మహేష్ సలాది విజ్ఞప్తి చేశారు.
News Posted: 19 June, 2009
|