పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
అనంతపురం : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించుందేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం మార్చిలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన పేద విద్యార్థలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఇది శుభవార్తే కానుంది. ఈనెల 29, 30 తేదీలలో కలెక్టర్ల నేతృత్వంలో కళాశాలల గుర్తింపు, విద్యార్థుల ఎంపిక జరగనుందని డిఆర్ డిఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమామణి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మొత్తం 342 మందికి ఈ విద్య అందనుందన్నారు. కలెక్టర్ ఆదేశాలమేరకు విద్యార్థుల ఎంపిక ఎలా చేయాలనేది నిర్ణయిస్తామని వెల్లడించారు.
News Posted: 27 June, 2009
|