నాట్స్ లో టీపీ డైరెక్టరీ బ్రోచర్
న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని ఆర్లాండోలో అత్యంత వేడుకగా నిర్వహించబోతున్న అమెరికా తెలుగు సంబరాల ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తెలుగుపీపుల్ సారధ్యంలో తొలిసారిగా వెలువడుతున్న 'తెలుగుపీపుల్ ఇన్ నార్త్ అమెరికా డైరెక్టరీ 2010' బ్రోచర్ ఈ వేడుకలలో లాంఛనంగా ఆవిష్కృతం కాబోతుంది. నాట్స్ వ్యవస్థాపకులలో ఒకరైన రాణాకుమార్ నాదెళ్ళ ఈ బ్రోచర్ ను ఆవిష్కరించబోతున్నారు.
వినూత్నంగా, విలక్షణమైన రీతిలో ప్రచురించబోతున్న 'తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ' ఈ ఏడాది డిసెంబర్ లో అందుబాటులోకి వస్తుంది. అటు అమెరికా, ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ బుక్ స్టోర్స్ , వాణిజ్య కేంద్రాలలో ఈ డైరెక్టరీ అమ్మకాలకు సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవాసం వచ్చి అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, వివిధ రంగాలలో స్థిరపడిన డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, కంప్యూటర్ నిపుణులు, అటార్నీలు, ఫైనాన్షియల్ నిపుణులు, ఐటి, హెల్త్ కేర్, ఫార్మా, సైన్స్ , టెక్నాలజీ, హోటల్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్ వంటి పలు రంగాలలో ఎనలేని ఖ్యాతి సంపాదించిన తెలుగువారు, వారు నిర్వహించే వ్యాపార, వాణిజ్య సంస్థల వివరాలతో తెలుగుపీపుల్.కామ్ ప్రచురించబోతున్న ఈ డైరెక్టరీ అమెరికన్ తెలుగు సమాజంలోనే ఒక సరికొత్త ప్రయత్నం కాబోతున్నది.
News Posted: 1 July, 2009
|