న్యూజెర్సీలో ఎబి స్పీడ్ వే
న్యూజెర్సీ : ఎడిసన్ నగరంలో 'ఆంధ్రా బ్యాంకు స్పీడ్ వే' సేవలను ప్రారంభించింది. జూన్ 29న జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్. రెడ్డి ఈ విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను సత్యనారాయణమూర్తి వేమూరు ఆహ్వానించగా, బ్యాంకు జనరల్ మేనేజర్ త్రివేది సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో ఆంధ్రా బ్యాంకు సాధించిన విజయాలను, ఖాతాదారులకు అందించిన సేవల గురించి జి.ఎం. త్రివేది వివరించారు. లక్ష కోట్ల రూపాయల వ్యాపారం చేయడం బ్యాంకు చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా ఆంధ్రా బ్యాంకు అన్ని శాఖల్లోనూ కోర్ బ్యాంకింగ్ సేవలను నూటికి నూరు శాతం అందించే దిశగా సాగిపోతున్నదని తెలిపారు.
న్యూజెర్సీలో ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్పీడ్ వే పథకం ముఖ్య ఉద్దేశాలు, అందించే సేవల గురించి బ్యాంకు జనరల్ మేనేజర్ రాకేష్ సేథీ విపులంగా వివరించారు. మహేశ్వరబాబు వందన సమర్పణ చేశారు.
News Posted: 1 July, 2009
|