సూర్యదేవరకు ‘తానా’ అవార్డు
షికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 17వ ద్వైవార్షిక ఉత్సవాలు గురువారం రాత్రి షికాగోలోని రోస్‌మాంట్ కన్వెన్షన్ సెంటరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ అవదాని మేడసాని మోహన్, నవలా రచయిత సూర్యదేవర రామ్మోహనరావు తదితరులకు తానా ప్రకటించిన అవార్డులను తానా వేదికపై ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ కి్‌వన్ ప్రదానం చేశారు.
వీరితో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తెలుగు ప్రముఖులైన తానా ట్రస్టు బోర్డు చైర్మన్ జానకీరావు, చిలుకూరి సతీష్, ల్యాంకో పవర్ మేనేజిగ్ లగడపాటి మధుసూదనరావు, సీఆర్ స్వామినాధన్, డాక్టర్ టి. కిరణ్‌కుమార్, రామ ముత్యాల, పరిడీ రాజేశ్వరి, పి.వి. ప్రసాద్, డాక్టర్ ఉప్పులూరి సుబ్బారావు, వంశీ రామరాజు, డాక్టర్ అట్లూరి శ్రీమన్నారాయణ, డాక్టర్ మన్నవ శివకుమార్, డాక్టర్ నన్నపనేని మంగాదేవి, డాక్టర్ అక్కినేని సుదర్శనరావులకు కూడా ఇల్లినాయిస్ గవర్నర్ తానా అవార్డులను అందజేశారు. సినీ నటుడు మురళీమోహన్‌కు రిజర్వు బాంకు మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి. రెడ్డి అవార్డును అందజేశారు.
News Posted: 4 July, 2009
|