షికాగో : ప్రవాసాంధ్రుడు కొర్రపాటి రఘుబాబు తానా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఇక్కడ జూలై 2 నుంచి 4వ తేదీల మధ్య వైభవంగా నిర్వహించిన తాన 17వ మహాసభల సందర్భంగా రఘుకు ఈ పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ క్విన్ చేతుల మీదుగా రఘు ఈ అవార్డును స్వీకరించారు. రఘుబాబు ప్రస్తుతం దక్షిణ కరోలినా రాష్ట్రం ఉన్నత విద్యా శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. రఘు అమెరికాలో రెండు దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వివిద హోదాల్లో ఉంటూ గణనీయమైన సేవలు అందిస్తున్నారు. ఐటీ రంగంలో సేవలకు గాను రఘుబాబు అనేక అవార్డులు అందుకున్నారు. విద్యారంగంలో పెట్టుబడులను విరివిగా పెంచేందుకు కృషి చేశారు.