వివిధ దేశాల్లో వైఎస్ బర్త్ డే
న్యూయార్క్ : ఈ నెల 11శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60వ జన్మదినోత్సవాలను వివిధ దేశాల్లో నిర్వహించనున్నట్లు ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఎన్ ఓసి) ఒక ప్రకటనలో వెల్లడించింది. 'గ్లోబల్ తెలుగూస్' ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఐఎన్ ఓసి ప్రజా సంబంధాల విభాగం ప్రతినిధి వేణు ఉడుముల మీడియాకు పంపించిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లండ్, కువాయిట్, రష్యా, దక్షిణాప్రికా, యుకె, వెస్టిండీస్ లలో వైఎస్సార్ జన్మదినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఒక భారత రాజకీయవేత్తకు వివిధ దేశాల్లో జన్మదినోత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం బహుశా ఇదే ప్రథమం అని వేణు ఉడుముల తన ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్లోబల్ తెలుగూస్ శుభాకాంక్షలు తెలిపింది. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, వృద్ధులు, వికలాంగ బాలబాలికలకు పెంచిన పెన్షన్ పథకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించింది.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోను, పలు దేశాల్లోను వైఎస్సార్ జన్మదినోత్సవాలు నిర్వహించే సంస్థలు, వాటి బాధ్యుల పేర్లను వేణు ఉడుముల తన ప్రకటనలో వెల్లడించారు. అమెరికాలోని ట్రైస్టేట్ (న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్), కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, ఇండియానాపోలిస్, కన్సాస్, కెన్ టకీ, మిన్నెసొట, మిస్సిసిపి, మిస్సోరి, న్యూ హ్యాంప్షైర్, న్యూ మెక్సికో, న్యూయార్క్, నార్త్ కరోలినా, ఓహియో, ఒక్లహామా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లండ్, కువాయిట్, రష్యా, దక్షిణాఫ్రికా, యుకె, వెస్టిండీస్ లలో వైఎస్సార్ జన్మదినోత్సవాలను నిర్వహించనున్నారు. వైఎస్సార్ జన్మదినోత్సవాలకు సంబంధించి ఇతర వివరాలు కావాల్సిన వారు -
వేణు,
pr@apinocusa.org,
Public Relations- AP INOC(Andhra Pradesh-Indian National Overseas Congress), USA
www.apinocusa.org లో సంప్రతించవచ్చు.
News Posted: 9 July, 2009
|