టీపీ డైరెక్టరీ బ్రోచర్ విడుదల
ఫ్లోరిడా : తెలుగుపీపుల్ డాట్ కామ్ ఆధ్వర్యంలో వెలువడనున్న 'తెలుగుపీపుల్ ఇన్ నార్త్ అమెరికా డైరెక్టరీ 2010' బ్రోచర్ ను సినీనటుడు నందమూరి తారకరత్న విడుదల చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జూలై 1- 3 తేదీల మధ్య ఓర్లాండోలోని ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సంస్థ ఆవిర్భావ దినోత్సవాలు 'అమెరికా తెలుగు సంబరాల్లో' ఈ బ్రోచర్ ను తారకరత్న ఆవిష్కరించారు. తొలి బ్రోచర్ ను నాట్స్ అధ్యక్షుడు రణకుమార్ నాదెళ్ళకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాట్స్ సంస్థ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
విలక్షణమైన రీతిలో సరికొత్తగా ప్రచురితమయ్యే 'తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ' ఇదే సంవత్సం డిసెంబర్ లో అందుబాటులోకి వస్తుంది. అమెరికా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లోను, వాణిజ్య కేంద్రాలలో ఈ డైరెక్టరీ లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవాసం వచ్చి అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, వివిధ రంగాలలో స్థిరపడిన డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, కంప్యూటర్ నిపుణులు, అటార్నీలు, ఫైనాన్షియల్ నిపుణులు, ఐటి, హెల్త్ కేర్, ఫార్మా, సైన్స్ , టెక్నాలజీ, హోటల్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్ వంటి పలు రంగాలలో లబ్ధ ప్రతిష్టులైన తెలుగువారు, వారి వ్యాపార, వాణిజ్య సంస్థల వివరాలతో తెలుగుపీపుల్ డాట్ కామ్ ఈ డైరెక్టరీని ప్రచురిస్తోంది.
వందలాది మంది ప్రవాసాంధ్రుల సమక్షంలో జరిగిన 'తెలుగుపీపుల్ ఇన్ నార్త్ అమెరికా డైరెక్టరీ 2010' బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు డాక్టర్ మధు కొర్రపాటి, రవి మాదల, దాసరి సతీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
News Posted: 9 July, 2009
|