సిఎంకు మహేష్ సలాది విషెస్
న్యూయార్క్ : ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మహేష్ సలాది, ఫండింగ్ సభ్యులు డాక్టర్ గడ్డం దశరథరామ్ రెడ్డి, డాక్టర్ మండవ నాగేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఆయురారోగ్యాలతో వైఎస్ రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా పరిపాలించాలని వారు ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, వృద్ధులు, వికలాంగులైన చిన్నారులకు పెంచి అందజేస్తున్న పెన్షన్ పథకం, వృద్ధాశ్రమాల నిర్వహణ లాంటి సాంఘిక సేవా కార్యక్రమాలు మరింత ఫలవంతంగా కొనసాగగలవన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
News Posted: 9 July, 2009
|