యుఎస్ లో కీరవాణి టూర్
న్యూజెర్సీ : ప్రముఖ సినీ నేపథ్య సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తొలిసారిగా అమెరికాలో పలు నగరాల్లో సంగీత విభావరులు నిర్వహిస్తున్నారు. జూలై 2 నుంచి 4 వరకూ ఓర్లాండోలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆహ్వానం మేరకు 'అమెరికా తెలుగు సంబరాలు' కార్యక్రమాల్లో పాల్గొనందుకు అమెరికా వచ్చిన కీరవాణి జూలై 2న షికాగోలో జరిగిన తెలుగు ఫెస్టివల్ తో తన టూర్ ను ప్రారంభించారు. ఆ తరువాత జూలై 4న ఓర్లాండోలో నాట్స్ నిర్వహించిన 'అమెరికా తెలుగు సంబరాలు'లో పాల్గొన్నారు. శాస్త్రీయ, ఆధునిక సంగీత బాణీలతో కీరవాణి స్వరపరిచే మధురమైన సినిమాపాటలు నాట్స్ సభకు హాజరైన 3,500 మంది పై చిలుకు అతిథులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. తన మధురమైన సంగీత బాణీలతో కీరవాణి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
కీరవాణి తన 18 ఏళ్ళ సినీ ప్రస్థానంలో సుమారు 200 పై చిలుకు చిత్రాలకు కీరవాణి మధురమైన నేపథ్య సంగీత బాణీలను సమకూర్చారు. 'శ్రీ రామదాసు' చిత్రానికి కీరవాణి సమకూర్చిన సంగీతానికి జాతీయ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో అందజేసే ఐదు నంది అవార్డులు కూడా కీరవాణి గెలుచుకున్నారు.
Pages: 1 -2- News Posted: 10 July, 2009
|