మోపిదేవి అభినందన సభ
న్యూజెర్సీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, కోర్టులు, సాంకేతిక విద్యా శాఖ మంత్రితో సమావేశం, అభినందన కార్యక్రమాన్ని తన మిత్రులు కొందరితో కలిసి ఏర్పాటు చేసినట్లు ముసుకు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానం పలికారు. లిన్ వుడ్ మిడిల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన మంత్రి అభినందన కార్యక్రమం అనంతరం ఆహూతులకు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
అభినందన సభ చిరునామా ఇది:
25 Linwood Pl
North Brunswick, NJ 08902.
News Posted: 11 July, 2009
|