పోలియో నిర్మూలనలో నాట్స్
న్యూజెర్సీ : చిన్నారుల పాలిట యమపాశంలా మారిన పోలియో మహమ్మారి నిర్మూలనలో పాలుపంచుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ముందుకు వచ్చింది. పోలియా మహమ్మారి నిర్మూలనతో ఇప్పటికే కృషి చేస్తున్న రోటరీ ఇంటర్నేషనల్, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ లతో చేతులు కలిపింది.
పోలియోను పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే ఉందని, ఇప్పుడు మనం ఈ మహమ్మారిని నిర్మూలించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాణాంతక వ్యాధి సమస్య మరింతగా ప్రబలిపోయి ప్రపంచంలోని చిన్నారుల జీవితాలను బలిగొంటుందని ఈ సందర్భంగా నాట్స్ ప్రతినిధులు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలియో వ్యాధిని యుద్ధ ప్రాతిపదికన నిర్మూలించకపో రానున్న 40 ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది బాల బాలికలు ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందన్న విషయం గ్రహించాలని, నిర్మూలన దిశగా కృషి చేయాలని నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.
పోలియా నిర్మూలనకు మన తక్షణ విధులు :
పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో కొన్ని ప్రాథమిక సవాళ్ళను అధిగమించాల్సి ఉందని ఆరోగ్య నిపుణులు అంగీకరిస్తున్నారు.
- ఆప్ఘనిస్తాన్, భారత్, నైజీరియా, పాకిస్తాన్ లాంటి ఖండాంతర దేశాల్లో ప్రబలుతున్న పోలియో మహమ్మారి యుద్ధ ప్రాతిపదికన నిర్మూలించాలి. లేకపోతే ఇతర పోలియో రహిత దేశాలకూ ఈ వ్యాధి వైరస్ ను ఇవి ఎగుమతి చేసే ప్రమాదాన్ని గుర్తెరగాలి.
- ఉత్తర నైజీరియాలోను, భారతదేశంలోని పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోను విస్తృతంగా వ్యాపిస్తున్న పోలియో వైరస్ ను నియంత్రించడం ప్రధానంగా మన ముందున్న సమస్య.
- ఇంతకు ముందు ప్రకటించిన పోలియో వైరస్ రహితమై దేశాల్లో అక్కడక్కడా కనిపిస్తున్న వ్యాధి కారక వైరస్ ను వేగంగా నిర్మూలించడం తక్షణావసరం.
- పోలియో రహిత ప్రాంతాల్లో కూడా పోలియో మందు వేయడంలో ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతున్నాయా అనే దానిపై ఎప్పటికప్పుడు కచ్చితమైన పర్యవేక్షణ నిర్వహించాలి.
- పోలియో నిర్మూలన కోసం నిధుల సేకరణను కొనసాగించడం, వ్యాధి నిర్మూలన విధానాల అమలులో రాజకీయపరమైన జోక్యం ఉండేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నాట్స్ సంస్థ తెలిపింది.
News Posted: 13 July, 2009
|