సిలికానాంధ్ర పాటల పందిరి
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర సంస్థ 8వ వార్షికోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఆగస్టు 8న 'పాటల పందిరి' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోని లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నిర్వాహకుడు కె. రామాచారి ఆధ్వర్యంలో ఈ పాటల పందిరి సుమధుర సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక సన్నివేల్ హిందూ దేవాలయం ఆడిటోరియంలో జరిగే సంగీత విభావరికి ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరు కావాలని ఆనంద్ ఆ ప్రకటనలో ఆహ్వానించారు. ఆ రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ సుమధుర సంగీత విభావరి జరుగుతుందని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థ జూలై 18 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకూ రామాచారి నిర్వహించే వేసవి లలిత సంగీత శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పాటల పందిరి కార్యక్రమంలో పాల్గొంటారని ఆనంద్ కూచిభొట్ల వివరించారు.
సిలికానాంధ్ర లలిత సంగీత శిక్షణ శిబిరం వివరాలు ఇవి :
Fees: $100 Duration: 3 Weeks (50 Hours)
Orientation: 4 PM on July 18, 2009
Venue: SiliconAndhra Office (above Namaste Plaza),
Lawrence Express Way, Sunnyvale, CA
Timings :
Batch 1: 9:30 AM - 12 Noon
Batch 2: 2:30 PM - 5 PM
Batch 3: 7 PM - 9:30 PM (Adults)
రానున్న మూడు నెలల్లో సిలికానాంధ్ర రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని ఆనంద్ కూచిభొట్ల తెలిపారు. ఆగస్టు 8వ తేదీన సిలికానాంధ్ర సంస్థ 8వ వార్షికోత్సవం, అక్టోబర్ 3న 'ఆంధ్రా కల్చరల్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇతర వివరాల కోసం :
Mr. Rao Tallapragada on email: rao@siliconandhra.org or 408-375-7853(cell)
Mr. Vijayasaradhi Madabhushi on email: vijayasaradhi@siliconandhra.org or 408-838-9218(cell) లను సంప్రతించవచ్చు.
News Posted: 18 July, 2009
|