25న కీరవాణి విభావరి
న్యూజెర్సీ : ప్రసిద్ధ సినీ నేపథ్య సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరిని జూలై 25 శనివారంనాడు న్యూజెర్సీలో ఏర్పా చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. భక్తిరస, కమర్షియల్ గీతాలకు అద్భుతమైన సంగీత బాణీలు సమకూర్చిన కీరవాణి సంగీత కార్యక్రమానికి యాంకర్ గా ప్రసిద్ధ యాంకర్ ఉదయభాను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విభావరిని టాలీ 2 హాలీ ఫిల్మ్స్, ఫార్మా కేర్, బిఇఎల్ ఎయిర్, ఎండి సంస్థలు సమర్పిస్తున్నాయి. ప్రముఖ గాయనీ గాయకులు గీతా మాధురి, మాళవిక, దీపు, నోయెల్ సహా మొత్తం 14 మందితో కీరవాణి మృదు మధుర సంగీత విభావరి అందిస్తారు.
ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా సమకూరిన నిధులను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నపొనెకల్లులో ప్రైమరీ కేర్ సెంటర్ నిర్మాణానికి వినియోగించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సంగీత విభావరి కార్యక్రమానికి అసెంబ్లీమేన్ ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించ దలచిన వారు తమ సీటును ముందుగానే నిర్ణయించుకొని, టిక్కెట్ ను www.ucpac.org or http://sa1.seatadvisor.com/sabo/servlets/TicketRequest?eventId=193697&presenter=UNCAC&venue=&event=లో కొనుక్కోవాలని నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలు కావాల్సిన వారు http://theimho.org/projects/infrastructure/rural-health లో సంప్రతించవచ్చు. లేదా Varma 302 750 4600, Vijay 443 616 6500, www.tolly2holly.comతో సంభాషించవచ్చు.
News Posted: 23 July, 2009
|