సిలికానాంధ్ర వార్షికోత్సవం
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర సంస్థ 8వ వార్షికోత్సవ సంబరాలను ఆగస్టు 8వ తేదీ శనివారంనాడు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి రాజు చామర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సన్నీవేల్ హిందూ దేవాలయం ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా అందరినీ సిలికానాంధ్ర సాదరంగా ఆహ్వానించింది.
ఉత్సవాల కార్యక్రమం వివరాలు ఇవీ :
సాయంత్రం 4 గంటలకు : మన బడి స్నాతకోత్సవం
5 గంటలకు : రామాచారి పాటల పందిరి.. ఆయన పాటలు, రామాచారి ఆధ్వర్యంలో బృందగానాలు, లలిత సంగీత పోటీల వాస్తవిక ప్రదర్శన (Reality Show)
రాత్రి 7.45 గంటలకు : వాస్తవిక పోటీ ఫలితాలు, బహుమతి ప్రదానం
8 గంటలకు వందన సమర్పణ ఉంటాయని రాజు చామర్తి తన ప్రకటనలో తెలిపారు.
అమెరికాలో ప్రప్రథమంగా జరుగుతున్న లలిత సంగీత శిక్షణా శిబిరంలో రామాచారి వద్ద గత మూడు వారాలుగా శిక్షణ పొందుతున్న సిలికానాంధ్రులు తమ విద్యను ఈ ఉత్సవాల వేదికపై ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం పీకాక్ రెస్టారెంట్ యాజమాన్యం సహకారంతో స్వల్ప రుసుముతో విందు భోజనం ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిలో మాతృభాషా సంస్కృతుల పరిరక్షణావశ్యకతను చాటి చెబుతూ నేటి తరంలో ఆ చైతన్యానికి ఊపిరులూదుతూ, ప్రపంచ రికార్డులు నెలకొల్పే మహా సాంస్కృతికోత్సవాలను సిలికానాంధ్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విదేశాలలో పుట్టి, పెరుగుతున్న బాలలకు తెలుగు భాష, సాహిత్యాభినివేశాన్ని కల్పిస్తూ నిత్యనూతనోత్సాహంతో సిలికానాంధ్ర పురోగమిస్తున్నది. ఈ సంస్థ 8వ వార్షికోత్సవాలు అమెరికాలోని ప్రవాసాంధ్రులందరికీ ఓ పండుగలా నిర్వహించేందుకు సిలికానాంధ్ర సంస్థ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది.
మిగతా వివరాల కోసం :
మాడభూషి విజయసారథి, ఫోన్ నంబర్ : 408 996 0680, ఈ మెయిల్ : vijayasaradhi@siliconandhra.org లో కాని,
తల్లా ప్రగడ రావు, ఫోన్ నంబర్ : 408 905 6009, ఈ మెయిల్ : rao@siliconandhra.org లో కాని సంప్రతించవచ్చు.
News Posted: 6 August, 2009
|