'హిందుత్వ'పై గోతియె స్పీచ్ న్యూజెర్సీ : 'హిందువుల దురవస్థ', 'తప్పుదారి పట్టిస్తున్న విధానాలు', 'ప్రమాదంలో పడిన హిందూ వ్యవస్థ పునరుద్ధరణ- ఆవశ్యకత - దాని కోసం నిధుల సమీకరణ' అనే అంశంపై ప్రసిద్ధ పాత్రికేయుడు, భారతదేశానికి చిరకాల మిత్రుడు, భారతదేశం గురించి డజను గ్రంథాలు రాసిన రచయిత ఫ్రాంకోయిస్ గోతియె ప్రసంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఫ్యాక్ట్ ఇండియా ఫండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 16 ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి న్యూజెర్సీ సోమర్ సెట్ ప్రాంతంలోని ఆర్ష బోధ సెంటర్ లో గోతియె ప్రసంగం ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు 15 డాలర్లు ప్రవేశ రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది (ఆహారంతో కలిపి). గోతియె ప్రసంగం కార్యక్రమానికి హాజరు కావాలనుకునేవారు http://medhanet.com/Francois16Aug2009.html వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లేదా http://www.medhanet.com/francois.html సైట్ ను పరిశీలించవచ్చు. ఈ మెయిల్ ద్వారా సంప్రతించాలంటే FactIndiaFunds@gmail.com, Ph: 847-462-4692 లో ప్రయత్నించవచ్చు. FACT Indiaకు అందజేసే విరాళాలపై పన్ను రాయితీ ఉంటుందని సంస్థ వెల్లడించింది. ట్యాక్స్ ఐడి 20-8615051. విరాళాలను FACT India, 6823 Windrock Rd, Dallas, TX 75252 Ph: 614-668-1668 పేరు మీద కూడా పంపించవచ్చు.
News Posted: 11 August, 2009
|