కళాభారతి చవితి ఉత్సవాలు న్యూజెర్సీ : ఆగస్టు 23 నుంచి 31వ తేదీ వరకూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాభారతి సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి పూజలు, అర్చన, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలోని 1710 ఓక్ ట్రీ రోడ్డులో ఉన్న 'ది మాల్ ఎట్ ఓక్ ట్రీ'లో 23 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఆంధ్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి ఉత్సవాలలో అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలని కళాభారతి ప్రకటనలో ఆహ్వానించింది. ఇతర వివరాలు, సూచనల కోసం www.kalabarathi.org వెబ్ సైట్ లో సంప్రతించవచ్చు.
గమనిక : పర్యావరణం, నీటి ప్రమాణాల సమస్యల కారణంగా వినాయక చవితి ఉత్సవాల చివరి రోజున నిర్వహించే 'నిమజ్జనం' కార్యక్రమానికి తమ తమ ఇళ్ళలో ప్రతిష్టించిన గణేశ విగ్రహాలను కళాభారతి వినాయక చవితి పూజా మండపానికి తీసుకురావద్దని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
News Posted: 13 August, 2009
|