ఎన్నారైల 'మావూరి వంట'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/27a.gif' align='left' alt=''>
న్యూయార్క్ : ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులకు తొలిసారిగా మాటీవి చానల్ ప్రత్యేకంగా 'మా వూరి వంట' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక స్థానిక చానల్ తమ వంటల ప్రత్యేకతను ప్రదర్శించేందుకు ప్రవాసాంధ్రులకు ఈ కార్యక్రమం చక్కని అవకాశం కల్పించింది. మాతృదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమం తమ తమ వంటల విధానం, అలవాట్లు, జీవన విధానాలు, ఏమి కోల్పోతున్నారో ఒకరితో ఒకరు పంచుకునేందుకు బాగా తోడ్పడింది. అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల హృదయాలను మా వూరి వంట కార్యక్రమం ఎంతగానో హత్తుకుంది. అమెరికా ప్రత్యేక మా వూరి వంట ఎపిసోడ్లు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి మాటీవి ప్రసారం చేస్తుంది.
News Posted: 17 August, 2009
|