డల్లాస్ విందుకు పురందేశ్వరి
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Purnadeswari.gif' align='left' alt=''>
డల్లాస్ : ఆస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో నిర్వహిస్తున్న తెలుగు భాషా బోధన కోసం నిధులు సేకరించే విందు సమావేశానికి భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సెప్టెంబర్ 26 శనివారం డల్లాస్ లో జరిగే ఈ విరాళాల విందు సమావేశానికి హాజరు కావాల్సిందిగా తాము పంపిన ఆహ్వానానికి పురందేశ్వరి సహృదయంతో సమ్మతించారని తానా ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. డల్లాస్ లోని ఫార్మర్స్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో మధ్యహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఈ విందు సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు. టెక్సాస్ వర్సిటీలో తెలుగు భాషా బోధన కోర్సును రెండేళ్ళ క్రితమే తానా ప్రారంభించిన విషయం తెలిసిందే.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో ప్రస్తుతం 30 మందికి పైగా విద్యార్థులు తెలుగు భాష కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారని ప్రసాద్ తోటకూర వెల్లడించారు. అందులోనూ అమెరికాకు చెందిన విద్యార్థులతో పాటు తెలుగు వారసత్వానికి ఎలాంటి సంబంధం లేని ఇతరులు కూడా తెలుగు భాష కోర్సు చేస్తుండడం విశేషం అన్నారు. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు తెలుగును సులభంగా చదవడం, రాయడం, మాట్లాడడంలో చక్కని శిక్షణ ఇస్తున్నారు. ఈ విందు సమావేశంలో పాల్గొని ఓ మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలనుకునే వారు ప్రసాద్ తోటకూరను 817-300-4747 ఫోన్ నెంబర్ లో గాని, prasadthotakura@gmail.com లో గాని సంప్రతించవచ్చు.
News Posted: 21 August, 2009
|