బే ఏరియాలో చిరు బర్త్ డే కాలిఫోర్నియా : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి 54వ పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 23న నిర్వహిస్తున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని మిల్పిటాస్ ప్రాంతంలోని 200 సీరా వేలో ఉన్న సీరా థియేటర్ లో సాయంత్రం 8 గంటల నుంచి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస మానాప్రగడ ఆ ప్రకటనలో వివరించారు. ఈ వేడుకల్లో అందరూ ఆహ్వానితులే అని ఆయన వెల్లడించారు.
చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు సీరా థియేటర్ యాజమాన్యం, అమెరికాలో మగధీర సినిమాకు ఏకైక డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న బ్లూ స్కై సినిమా యాజమాన్యం ఉత్సాహంగా ముందు వచ్చినట్లు శ్రీనివాస మానాప్రగడ తెలిపారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ, కాజోల్ నటించిన మెగాహిట్ చిత్రం 'మగధీర' సినిమాను చూసేందుకు సీరా థేయేటర్ లోకి చిరంజీవి చిత్రంతో ముంద్రించిన టీ షర్ట్ లు ధరించిన అభిమానులు పాల్గొనడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు :
Srinivasa Manapragada - 408-203-8905
Kalyan Palla - 510-299-0310
Srikanth Palivela - 408-887-8425
Ram Thota - 408-393-6782
Murali - 510-449-8531
Narasaiah Vadranam - 678-612-6714
లో సంప్రతించవచ్చు.
News Posted: 24 August, 2009
|