సునీత సంగీత మధురిమలు న్యూజెర్సీ : ప్రముఖ సినీ నేపథ్య సంగీత గాయని సునీత సంగీత మధురిమలు (మ్యూజికల్ మూమెంట్స్ ఆఫ్ సునీత) పేరిట లైవ్ సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ క్రియేషన్స్ కు చెందిన లక్ష్మి దేవినేని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభావరిలో సునీతతో పాటు హైదరాబాద్ కు చెందిన గాయకుడు శ్రీకృష్ణ తదితరులు కూడా తమ గానమాధుర్యంతో ప్రేక్షకులను వీనుల విందు చేస్తారని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 20 న న్యూజెర్సీలోని ఫోర్డ్స్ ప్రాంతంలోని 1050 కింగ్ జార్జి రోడ్డులో ఉన్న రాయల్ ఆల్బెర్ట్స్ ప్యాలెస్ లో సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య సునీత సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు లక్ష్మి దేవినేని వివరించారు. ఈ విభావరికి హాజరయ్యే వారికి ఆ రోజున రాత్రి 8 గంటలకు ప్రముఖ నటి శ్రియతో కలిసి విందు భోజనం చేసే చక్కని అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సంగీత విభావరి కార్యక్రమానికి టిక్కెట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని లక్ష్మి దేవినేని పేర్కొన్నారు. సునీత సంగీత విభావరికి హాజరయ్యేందుకు ఒక జంటకు ప్రత్యేక టిక్కెట్టు ధర 300 డాలర్లు. ఈ టిక్కెట్ ధరలోనే సంగీత విభావరితో పాటు నటి శ్రియతో కలిసి సినిమా చూసే అవకాశం కూడా కల్పించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా హాస్యనటులు వెంకీ, వేణు తమ కార్యక్రమాలతో కడుపుబ్బ నవ్విస్తారు.
టిక్కెట్లు పెద్దలకు 25, 50, 75 డాలర్లు, పిల్లలకు 10 డాలర్ల ఖరీదులో లభ్యమవుతాయి. పదేళ్ళ లోపు ఉన్న చిన్నారులకు ఉచిత ప్రవేశం. టిక్కెట్లను హైదరాబాద్ బిర్యానీ హౌస్, 732-277-7510, దక్షిణ్ రెస్టారెంట్, 732-494-6363 నుంచి పొందవచ్చు. ఆన్ లైన్ లో టిక్కెట్లు కావాలంటే www.teluguone.com లో తీసుకోవచ్చు. టిక్కెట్లు, ఇతర వివరాల కోసం సిద్ధార్థ్ - 732-306-0729, శశి - 609-647-9426, లక్ష్మి - 732-822-2493, రాజీవ్ - 732-979-7050 ఫోన్ నెంబర్లలో సంప్రతించవచ్చు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్లుగా అడ్వాంటెక్స్ గ్రూపు, కర్టెసీ - టివి ఏసియా వ్యవహరిస్తున్నాయి.
News Posted: 29 August, 2009
|