'మగధీర'తో సాయి గుడి బోస్టన్ : సాయిబాబా ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు సాయి తెలుగు మూవీస్ కు చెందిన శ్రీకాంత్ దివి ఒక ప్రకటనలో తెలిపారు. మగధీర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని సెప్టెంబర్ 10 గురువారంనాడు లోవెల్ ప్రాంతంలోని షోకేస్ సినిమాస్ లో రాత్రి 9.55 గంటలకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా వసూలైన మొత్తాన్ని మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ నగరంలోని న్యూ ఇంగ్లండ్ షిరిడీ సాయి ఆలయం నిర్మాణానికి వినియోగించనున్నట్లు శ్రీకాంత్ తన ప్రకటలో వివరించారు.
ఒక మంచి కార్యక్రమం కోసం మగధీర చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించిన చిత్ర పంపిణీదారు 'బ్లూ స్కై సినిమాస్' వారికి శ్రీకాంత్ దివి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర వివరాలు కావాల్సిన వారు Sai Telugu Movies - Srikanth Divi - 339 203 0211, Krishna Pattolla - 203 243 8773 ను సంప్రతించవచ్చు.
News Posted: 31 August, 2009
|