12 నుంచి 'ప్రజ్ఞ' తరగతులు న్యూజెర్సీ : జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెఇటి) ఆధ్వర్యంలో 2009 - 10 విద్యా సంవత్సరం 'ప్రజ్ఞ' తరగతులు సెప్టెంబర్ 12 శనివారం, 13 ఆదివారాల్లో ప్రారంభిస్తున్నట్లు సంస్థ న్యూజెర్సీ చాప్టర్ ప్రకటించింది. ఈ విద్యా కార్యక్రమంలో చేరదలచిన విద్యార్థులు సెప్టెంబర్ 6వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సంస్థ తెలిపింది. విద్యార్థులు నమోదు చేసుకునేటప్పుడే వారు తరగతిలో చేరే తేదీ, అభ్యసించే కోర్సు వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఈ తరగతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమం సెప్టెంబర్ 5 శనివారం, 6 ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వివరించింది. నాలుగేళ్ళ నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు వారికి సెప్టెంబర్ 12, 13 తేదీల్లోనూ ఉదయం 10 నుంచి జీయర్ ఆశ్రమంలో తరగతులు ప్రారంభం అవుతాయి. పద్దెనిమిదేళ్ళకు పైబడిన విద్యార్థి గ్రూపులకు తరగతులు ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తెలిపింది.
యోగ, కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం, తెలుగు, హిందీ భాషలపై ప్రజ్ఞ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక అంశాలను చదవడం, వేద సంప్రదాయం, సాహిత్యానికి సంబంధించిన ప్రాథమికాంశాలు, శ్లోకాలు, ప్రార్థనలు, వేద సాహిత్యంలోని కథలు, నీతి కథలు చదవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రసిద్ధ ఆచార్యులు, భక్తుల జీవిత చరిత్రలు, మన పండుగలు, ఉత్తమ విలువలపై చక్కని అవగాహన కల్పించడం, కమ్యూనిటీ సేవలు, సంస్కృత పదాలు, టెర్మినాలజీపై అవగాహన, మంచి పౌరునిగా ఎదిగేందుకు కావాల్సిన లక్షణాలు, అభివృద్ధ కారక అంశాలపై ఈ తరగతుల్లో శిక్షణ ఉంటుంది.
విద్యార్థుల సౌకర్యార్థం న్యూజెర్సీలో మూడు చోట్ల ప్రజ్ఞ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వివరించింది. న్యూజెర్సీలోని క్రాన్ బరీ ప్రాంతం (కో ఆర్డినేటర్ విజయ అల్లక్కి - ఫోన్స్ 609-750-1143, 609-297-8797) లోని 222 డే రోడ్ లోని జీయర్ ఆశ్రమంలోను, ఎడిసన్ లోని 3 క్లెమ్మెన్స్ సిటి (కో ఆర్డినేటర్ - జమున పుస్కర్ - ఫోన్ 732-662-4117)లోని వుడ్ బ్రూక్ కార్నర్ లోను, మారిటన్ లోని 77 కోల్స్ గేట్ రోడ్ (కో ఆర్డినేటర్ - మాధురి దంతులూరి - ఫోన్ 856-874-4442)లోనూ ప్రజ్ఞా శిక్షణ తరగతుల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి వివరాలు కావాల్సిన వారు విజయ అల్లక్కి - ఫోన్ 609-750-1143, అపర్ణ డింగరి - ఫోన్ 267-566-7059, శైలజ చెప్యాల - ఫోన్ 732-780-6424, ఇందిరా దీక్షిత్ (నృత్యం కోసం) - ఫోన్ 732-940-7409, గిరి వేదాంతం - ఫోన్ 732-521-1190, కృష్ణ నాయుడు - ఫోన్ 973-334-7715లలో సంప్రతించవచ్చు.
జీయర్ ట్రస్ట్ నిర్వాహకుడు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో నడుస్తున్న ఈ ప్రజ్ఞ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సంస్థ ఉత్సాహవంతులను ఆహ్వానించింది.
News Posted: 31 August, 2009
|