ఎన్నారై పిఆర్పీ నివాళి జార్జియా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలవడంతో ప్రజారాజ్యం పార్టీ ఎన్నారై వింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వైఎస్ మరణ వార్త విన్న వెంటనే పిఆర్పి ఎన్నారై వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకట్ సంజీవ్ ఒక ప్రకటనలో వైఎస్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ మృతి వార్తతో తామంతా తీవ్ర షాక్ కు గురైనట్లు ఆయన తెలిపారు.
పేదల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం అహరహం శ్రమించిన వైఎస్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో అభిమానం అని, మంచి మిత్రుడు కూడా అని వెంకట్ సంజీవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
News Posted: 3 September, 2009
|