ఆటా విచారం వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రియతమ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించారన్న వార్త విని తీవ్ర మనోవేదనకు గురైనట్లు అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఇంత బాధాకరమైన సమయంలో వైఎస్ కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. నిజంగా మనం ఒక మహా నాయకుడిని కోల్పోయామని జితేందర్ రెడ్డి తన సంతాపంలో పేర్కొన్నారు.
ఇదే ప్రమాదంలో ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు అసువులు బాసిన ఇతర అధికారులు, పైలెట్ల కుటుంబసభ్యులకు కూడా జితేందర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News Posted: 4 September, 2009
|