టిఎల్ సిఎ అశ్రు నివాళి న్యూజెర్సీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రియతముడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతికి న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ అశ్రు నివాళులు అర్పించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డైనమిక్ నాయకుడని, క్రాంతదర్శి, భవిష్యత్ దార్శనికుడు అని టిఎల్ సిఎ ప్రెసిడెంట్ వెంకటేశ్ ముత్యాల తన సంతాప ప్రకటనలో అభివర్ణించారు. వైఎస్ మరణంతో మన అందరి జీవితాల్లో తీర్చలేని లోటు ఏర్పడిందని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని వెంకటేశ్ ముత్యాల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ లోను, యావద్భారత దేశంలోనే కాకుండా అమెరికాలోను, ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగువారంతా భగవంతుడని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వెంకటేశ్ ముత్యాల తెలియజేశారు.
News Posted: 4 September, 2009
|