మహేష్ సలాది సంతాపం

వాషింగ్టన్ : కోట్లాది మంది ప్రజల హృదయాలను తన చిరునవ్వుతో, ధైర్యసాహసాలతో చెరగని ముద్ర వేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పేదల మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతికి అమెరికాలోని ప్రవాస ఆంధ్రప్రదేశ్ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ (ఎపి ఐనాక్) అధ్యక్షుడు మహేష్ సలాది ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ఆయన ప్రార్థించారు. వైఎస్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు మహేష్ సలాది తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
News Posted: 4 September, 2009
|