షికాగోలో వైఎస్ సంతాప సభ షికాగో : ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానికి సంతాపంగా సభ నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ షికాగో హిందూ దేవాలయం కోశాధికారి జయదేవ్ మెట్టుపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లినాయిస్ రాష్ట్రం షికాగో నగరంలోని లేమాంట్ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈ సభలో సంతాపం తెలియజేయనున్న ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ షికాగో హిందూ దేవాలయం, స్థానిక తెలుగు సంఘాలైన టిఎడిసి, టిటిఎ, సిటిఎ, తానా, ఆటా, నాట్స్ సంస్థల ప్రతినిధులు సంతాపసభను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
News Posted: 5 September, 2009
|