తెలుగు కళాసమితి సంతాపం రియాద్ : హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడం పట్ల సౌదీ అరేబియాలోని తెలుగు కళా సమితీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. స్వర్గీయ వైఎస్ అందరివాడని సంస్థ అశ్రు నివాళులు అర్పించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలను ఆదుకునే దిశగా వివిధ సంక్షేమ పథకాలు రూపొందించడంలో అగ్రగామిగా వైఎస్ పేరు తెచ్చుకున్నారని తెలుగు కళా సమితి నిర్వాహకులు నివాళులు అర్పించారు. చెదరని చిరునవ్వుతో 'నా అక్కలు, చెల్లెళ్ళు' అని ఆప్యాయంగా పలుకరించే రాజశేఖరరెడ్డి అకాల మరణం తామందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మృతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలువారందరికీ తీరని లోటు అని తెలుగు కళా సమితీ సభ్యులు అన్నారు.
సౌదీలో ప్రస్తుతం వేసవి సెలవులు అయినందున పలువురు తెలుగు కళా సమితి సభ్యులు భారతదేశంలోనే ఉన్నరని, వారంతా పలు చోట్ల జరుగుతున్న సంతాపసభల్లో పాలుపంచుకుంటున్నారని సమితి ఒక ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ మృతికి తెలుగు కళా సమితి అధ్యక్షుడు ఫైసల్ జంగ్, ముఖ్య సభ్యులు కె.వి. కుమార్, ఖారిద్, బాబూరావు, లక్ష్మయ్య, రాధాకృష్ణ, భాను ప్రకాశ్, ఎన్.ఎస్. రాజు, చాటీ, గోపాలకృష్ణ, జిఎస్ బి రావు, భాస్కర్రావు, ఆనల్ రావు, ఉమా మహేశ్వర్రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. వైఎస్ కుటుంబ సభ్యులకు సౌదీ తెలుగు కళా సమితి సభ్యులు సానుభూతిని వ్యక్తం చేశారు.
News Posted: 8 September, 2009
|