12న వైఎస్ కు నివాళి న్యూజెర్సీ : హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన జనహిత నాయకుడు, ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభను సెప్టెంబర్ 12న న్యూజెర్సీ ఫోర్డ్స్ ప్రాంతంలోని 1050 కింగ్ జార్జి రోడ్డులో ఉన్న రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లు ముసుకు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ వైఎస్ సంస్మరణ సభ జరుగుతుందని ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు కొవ్వుత్తులు వెలిగించనున్నట్లు, ఆ వెంటనే అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముసుకు మహేందర్ పేర్కొన్నారు.
ఈ నెల 6న న్యూయార్క్ లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభకు హాజరు కాలేకపోయిన అనేక మంది ఆ మహా నాయకుడికి నివాళులు అర్పించేందుకు వీలుగా న్యూజెర్సీలో 12వ తేదీన మళ్ళీ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ముసుకు మహేందర్ వివరించారు. ఇతర వివరాలు, ఆన్ లైన్ లో సంతాప సందేశాలు పంపించదలచిన వారు www.rememberingysr.org వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలియజేసి దివంగత మహా నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించాలని ముసుకు మహేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ సంస్మరణ సభకు హాజరయ్యే వారు ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవడం మరిచిపోవద్దని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 9 September, 2009
|