20న బతుకమ్మ పండుగ న్యూజెర్సీ : అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 20 బతుకమ్మ పండుగ\ సమ్మర్ పిక్నిక్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా చాప్టర్స్ ప్రతినిధి మురళి చింతల్పని ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 20 ఆదివారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. న్యూజెర్సీలోని గ్రోవ్ 4, ఫోర్స్ గేట్ డాక్టర్ మన్రో ప్రాంతంలోని థామ్సన్ పార్క్ లో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు.
బతుకమ్మ పండుగ\ సమ్మర్ పిక్నిక్ సందడి సందర్భంగా ఆ రోజంతా పురుషులు, మహిళలు, చిన్నారులకు వివిధ రకాల ఆటలపోటీలు నిర్వహించనున్నట్లు మురళి చింతల్పని తెలిపారు. ఈ సంబరాలకు హాజరయ్యే వారు తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని తయారుచేసుకొని వచ్చి నలుగురితో కలిసి ఆనందంగా పంచుకోవచ్చని ఆయన ప్రకటనలో సూచించారు.
ఇతర వివరాలు కావలసిన వారు www.Telangana.org లో ఫ్లయర్ ను చూడవచ్చు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అందరినీ న్యూజెర్సీ \ న్యూయార్క్ \ ఫిలడెల్ఫియా చాప్టర్లు ఆహ్వానిస్తున్నట్లు మురళి చింతల్పని తెలిపారు.
News Posted: 9 September, 2009
|