బతుకమ్మ పోస్టర్ విడుదల బే ఏరియా : సంప్రదాయ బద్ధంగా ప్రతి ఏటా తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ) పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలను సన్నివేల్ లోని ఆర్టెగా పార్కులో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభ సూచికగా టిసిఎ నిర్వాహకులు పోస్టర్ ను విడుదల చేశారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. ఈ నెల 20 మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకూ 4వ మెగా బతుకమ్మ ఉత్సవాలను ఇదే పార్కులో టిసిఎ నిర్వహించనున్నదని ఆ సంస్థ చైర్మన్ విజయ్ చవ్వ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను విస్తృత ప్రచారం కల్పిస్తున్న టిసిఎ గత ఐదేళ్ళుగా అమెరికాలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టిసిఎ బతుకమ్మ పండుగలో తెలంగాణేతరులు, ఉత్తర భారతీయులు, అమెరికా వాసులు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఉత్సాహంగా పాల్గొంటుండం విశేషం. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు సన్నివేల్ మేయర్ స్పిటలేరి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని విజయ్ చవ్వ తెలిపారు. ఈ పండుగ అనంతరం ఆహూతులందరికీ షడ్రసోపేతమైన తెలంగాణ సాంప్రదాయ రీతిలో ఉచితంగా విందు భోజనాన్ని టిసిఎ \ అతిథి రెస్టారెంట్ సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు. టిసిఎ బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
బతుకమ్మ పండుగ ప్రారంభ కార్యక్రమానికి విజయ్ చవ్వ, బిక్షం పాలబిందెల, ప్రహ్లాద్ అలిశెట్టి, రమేష్ వంకా, రాజు సాగిరాజు, రాంప్రసాద్, మోహన్ మన్యం, కాశ్యప్, సాయి ప్రసాద్, రమేష్ గుబ్బ, పేరి శ్రీనివాస్, అర్షద్ హుస్సేన్, విజయ్ బెల్లం, కొండారెడ్డి, ఫణి, వేణు కంబంపాటి తదితరులు హాజరయ్యారు. ఇతర వివరాలు కావాల్సిన వారు :
Biksham 408-329-2864
Arshad Hussain 408-203-6676
Bhaskar Maddi 831-917-0977
Raju Yasala 408-398-0222 లో సంప్రతించవచ్చు. లేదా www.TelanganaCulture.org website ను పరిశీలించవచ్చు.
News Posted: 15 September, 2009
|