న్యూజెర్సీలో 'బత్కమ్మ' న్యూజెర్సీ : తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బత్కమ్మ పండుగను ఈ నెల 19 శనివారం న్యూజెర్సీలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహక సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆ రోజంతా పూర్తి ఉత్సాహకర వాతావరణంలో డి.జె. కార్యక్రమం, పురుషులు, మహిళలు, పిల్లలకు విడివిడిగా ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటన స్పష్టం చేసింది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ బత్కమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి హాజరు కావాలని బత్కమ్మ పండుగ నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. ఈ పండుగకు హాజరయ్యే వారు తమకు అత్యంత ఇష్టమైన ఆహారపదార్థాన్ని తీసుకువచ్చి ఇతరులతో కలిసి ఆనందంగా ఆరగించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
న్యూజెర్సీలోని డొనాల్డ్ సన్ పార్క్, గ్రూవ్ - 4లో ఉన్న హైలాండ్ పార్క్ లో ఆ రోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ బత్కమ్మ పండుగ జరుగుతుంది. బత్కమ్మ పండుగకు స్పాన్సర్లుగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన హల్దీ చౌక్, దక్షిణ్ గ్రూప్ రెస్టారెంట్, కోరియాండర్ రెస్టారెంట్ యాజమాన్యాలకు నిర్వాహక కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ పండుకు సంబంధించి ఇతర వివరాలు కావాల్సిన వారు నర్సింగ్ చింతపల్లి - 732-789-6707, నందు యాష్కి - 732-319-6149, అన్నారెడ్డి - 609-240-7415, జగదీష్ గబ్బెట - 908-625-5993, రవిరెడ్డి రేగట్టె - 484-904-7529, వెంకట్రాజం చిలుక - 732-261-6094, కార్తీక్ రెడ్డి - 678-469-8306, మోహన కృష్ణ మన్నవ - 973-980-8079, రజని బిల్లకంటి - 215-794-0353 తదితరులను సంప్రతించవచ్చు.
News Posted: 15 September, 2009
|