పురాణ ప్రలాపంపై చర్చాగోష్ఠి చికాగో : ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రచారం పొందిన పుస్తకం 'పురాణ ప్రలాపం'పై చర్చా కార్యక్ర చేపట్టినట్లు చికాగో సాహితీ మిత్రులు సంస్థ తరఫున శారద మెట్టుపల్లి తెలిపారు. ఈ చర్చలో పాల్గొనాల్సిందిగా సాహితీ ప్రియులు, మిత్రులకు ఆమె ఆహ్వానం పలికారు.
లెమాంట్ హిందూ దేవాలయం (630-972-0300) గుప్తా డైనింగ్ హాల్ లో సెప్టెంబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు
ఈ సాహితీ చర్చ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత J.L.Reddy తో పరిచయం, ముఖాముఖి ప్రశ్నలు సమాధానాలు ఉంటాయని ఆమె వెల్లడించారు.
పురాణ ప్రలాపం పుస్తకాన్ని ఇంటర్నెట్ లో కూడా ఉచితంగా చదవవచ్చు. దాని లింక్ ఇది : http://www.esnips.com/doc/4147ce03-6e2f-47db-8550-9fccda0d260a/Purana_Pralapam_revised/?widget=documentIcon.
ఆసక్తికరమైన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని శారద మెట్టుపల్లి ఆహ్వానించారు. ఈ చర్చా గోష్ఠికి సంబంధించి మరిన్ని వివరాలు కావాల్సిన వారు, ప్రకాష్, 630 195 1424 లేదా జయదేవ్ 630-375-0131 నంబరులకు ఫోన్ చేయవచ్చు.
News Posted: 17 September, 2009
|